Categories

అమ్మాయిలకు అదంతా సులువుకాదు అని కొట్టిపడేస్తారు కానీ హెలికాప్టర్ పైలట్ అవ్వటం నా జీవిత కాంక్ష. నా పట్టుదల చూసి అమ్మ నాన్న వప్పుకొన్నారు. 2016 లో అమెరికా లోని హవాయిలోని మానలోవా హెలికాప్టర్ అకాడమీలోచేరాను. నేను చేరిన సంస్థనే నాకు ఉద్యోగం ఇచ్చింది అంటోంది వైజాగ్ అమ్మాయి క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్ హెలికాప్టర్ పైలట్. విమానాల్లో లాగా దీనిలో ఆటో పైలట్ అవకాశం ఉండదు. ప్రతి సెకను దీక్ష తో ఉండాలి. అమ్మాయిలకు ఇది నిజంగా ఛాలెంజింగ్ జాబ్ అంటుంది క్రితి గరుడ.