Categories
తిరువణ్ణామలై లోని గిరిజన గూడెం లో కలియప్పన్ అనే మలయాళ రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన వి.శ్రీపతి సివిల్ జడ్జ్ గా అర్హత పొంది చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు తమిళనాడు లో గిరిజన మహిళ జడ్జి ఒక్కరు కూడా లేరు.కొండ ప్రాంతంలో వ్యవసాయం చేసుకొని జీవించే మలయాళీ తెగ లో ఆడపిల్లలు చదువుకోవటమే విశేషం. లా చదువుకోవడం ఇంకా విశేషం. ఇక సివిల్ జడ్జి కావడం అంటే చరిత్ర సృష్టించటమే శ్రీపతి వయసు 23. గిరిజనులను చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశం తోనే నేను ఇలా చదువుకున్నాను అంటుంది శ్రీపతి.