Categories

ఒడిశా కు చెందిన అలక్ నందా కథక్ నృత్య కళాకారిణి. ఆమెకు ఒవేరియన్ క్యాన్సర్ పాకింది. కీమోథెరపీ లు చేయించుకుంటూ వైద్యం తీసుకుంటున్న ఆమె నృత్యం మానలేదు. గురువు గా ఆమెకు మంచి పేరుంది. మహాభారతంలోని గాధలను కథ రూపకాలుగా ప్రదర్శిస్తుంది. ద్రౌపతి పాత్ర లోని స్త్రీ వారి కోణాన్ని ప్రదర్శించే ఆమె తలపైన ఒక్క వెంట్రుక కూడా లేకుండా కథక్ ప్రదర్శన ఇస్తూ నా పోరాటం క్యాన్సర్ తో నా నృత్యం నృత్యమే. జబ్బు నా నృత్యాన్ని తనతో తీసుకుపోలేదు. మరణించే ముందు వరకు నేను ఒక్క రోజు కూడా వృధా చేసుకోను అన్నారామె. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఉండాలో ఆమె తనను తానే ఉదాహరణ గా చూపెట్టారు.