మార్పు స్పష్టంగానే కనిపిస్తుంది . తమకు అవమానం జరిగితే ఊరికే మనసులో పెట్టుకొని భాదపడుతూ ఊరుకోవటం లేదు . నడివీధిలో నలుగురికి తెలిసేలా చేయాలి అనుకొంటున్నారు . ఇప్పుడు కెన్యా మహిళలు అలా రహదారుల మీద కి వచ్చారు . స్థానిక యూనిటీ యూసఫ్ ఆధ్వర్యంలో “చాక్ బాక్ ” పేరుతో ఒక ఉద్యమం మొదలు పెట్టారు . రోడ్డుపైన రంగుల చాక్ పీస్ లతో తమ భాదను అక్షర రూపం ఇవ్వటం మొదలు పెట్టారు . తమ అవమానాన్ని నేలపైన చాక్ పీస్ తో రాస్తే రహదారిన నడిచే వాళ్ళు వారిని నిలదీస్తున్నారు .అడిగిన వాళ్ళలో మాకీ  అవమానం జరిగిందని వివరిస్తున్నారు మహిళలు . మమ్మల్ని అవమానించిన వాళ్ళు ఈ రోడ్ల పైన నడిచేందుకు భయపడుతున్నారు అంటోంది యూసఫ్ .

Leave a comment