సంవత్సరం వయసులోనే కండరాల వ్యాధితో చక్రాల కుర్చీ కే పరిమితం అయిన చాందినీ నాయే ఇవ్వాళ పేరున్న సెలబ్రెటీ కేరళకు చెందిన చాందినీ డాక్టర్ కావాలనుకొన్నది . బెంగుళూరు లోని ఆక్స్ ఫర్డ్ కాలేజిలో డిఫార్మ సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది నటించటం ఇష్టమే చక్రాల కుర్చీలో కూర్చునే డబ్ స్మాష్ తో సినిమా స్టార్ల డైలాగ్స్ అనుకరిస్తూ వీడియోలు చేసింది . వెరైటీ మీడియా పేస్ బుక్ పేజీలో ఆమె చేసిన వీడియోలకు 60లక్షల మంది చూశారు . ఓ పక్క చదువు ఇంకోపక్క టిక్ టాక్ వీడియోలతో తీరిక లేకుండా ఉండే చాందినీ ఎక్కడా వీల్ చైర్ లో ఉన్నానని బయట పెట్టారు దయతో వచ్చే లైక్ లు నాకు అక్కరలేదు అంటోంది . 200 పైగా ఆమె చేసిన టిక్ టాక్ వీడియోలకు లక్షల కొద్దీ వీక్షకులున్నారు .