గబగబా పని ముగించుకొని వేళకి ఆఫీస్ లో చేరిపోవాలంటే ఇంకా ముస్తాబుకు సమయం సరిపోదు అంటున్నారు అమ్మాయిలు. బ్యూటిషియన్లు ఈ టిప్స్ పాటించండి నిమిషాల్లో మేకప్ పూర్తి చేయవచ్చు అంటున్నారు. కళ్ళకు పెట్టుకొనే ఫాల్స్ ఐ లాషెస్ వివిధ సైజులు,రంగులు మార్కెట్లో దొరుకుతాయి కాటుక దిద్దుకొనే సమయం లేకపోతే ఇవి పెట్టుకోవచ్చు. సెమి పర్మినెంట్ ఐ లాషెస్ అయితే ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పాడయిపోకుండా ఉంటాయి. వీటిలో కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి , లిప్ స్టిక్ చెదిరిపోకుండా ఉండాలంటే వెల్వెట్ రకం లిప్ స్టిక్ బావుంటుంది. రోజంతా పెదాలకు మృదువుగా అంటుకొనే ఉంటుంది. ఇలా చిన్న టిప్స్ నేర్చుకుంటే ఎప్పుడు మేకప్ లో మెరిసిపోవచ్చు.

Leave a comment