నాలుగు సినిమాలలో ఎంతో బిజీగా వున్నానంటోంది అనుష్క. సూర్యతో సింగం 3 ప్రభాస్ తో బాహుబలి లేడీ  ఓరియెంటెడ్ మూవీ భాగమతి నాగార్జున రాఘవేంద్ర రావులతో ఓం నమో వెంకటేశాయ . అన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. ఈ నాలుగు నెక్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవుతాయి. సింగం ఒకటి రెండు ఇప్పుడు మూడు సినిమాల్లో అనుష్క జోడీగా నటించింది. ఇప్పటి సింగం 3 లో అనుష్క తో  హీరోయిన్ శ్రుతీ హాసన్ కూడా కలిసి నటిస్తోంది. శృతికి ఇందులో గ్లామరస్ పాత్ర యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయిట. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించటం వల్లనా ఏమో అనుష్క భుజాలపై సినిమా మొత్తం హీరోల మాదిరి మోయటం  నేర్చుకొన్నదనీ  అందుకే సినిమా సినిమాకు గెటప్ శరీరం నాజూకుతనం చూపిస్తుందని ఇందుకు సైజ్ జీరో ఉదాహరణ చాలుననీ  సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుసుకున్న సత్యం అనుష్క అందమైనదే కాదు. నిజమైన యాక్టర్ .

Leave a comment