పరిమితికి మించిన ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించుకోవటానికి సరిపడా స్రావాలను విడుదలచేయటానికి అంతర్గత అవయవాలు అవసరానికి మించి శ్రమపడాల్సి వస్తుందని  ఇలా తరచుగా జరుగుతూవుంటే  మెటాబాలిజమ్ ఎండోక్రైన్ పనితీరు గాడితప్పి గ్రోత్ హార్మోన్ తగ్గటం జరుగుతుందని డాక్టర్లు చెపుతారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే జీర్ణరసాలు సరిపోక పొట్టలో అసౌకర్యం మొదలవుతుంది. అప్పుడు కొన్ని చిట్కాలు పాటించమంటున్నారు. పెద్దవాళ్ళు రెండు టేబుల్ స్పూన్ల సోంపు వేయించి పొడిచేసి  గ్లాసునీళ్లలో ఓ స్పూన్ పొడి  వేసుకుని రెండు సార్లు తాగితే ఈ ప్రాబ్లమ్ పోతుంది. ఒక టీ స్పూన్ అల్లం తురుము గోరు వెచ్చని నీళ్లతో కలిపి దీనికి కాస్త నిమ్మరసం తేనె  కలిపి తీసుకున్నా సూపర్. ఇక వాము అల్లం కలిపి నూరి ఆ ముద్దను గోరు వెచ్చని నీళ్లతో కలిపి తాగితే చాలు. అలాగే ఎక్కువ నీళ్లు తగవుతున్న ఈ సమస్య రాదు. అసిడిటీ వదలాలంటే సోడా ఉప్పు కొద్దీ చుక్కల నిమ్మరసం కలిపి తాగచ్చు.

Leave a comment