శుభకార్యం అనగానే ఇంటికి మామిడి మండల తోరణాలు కట్టేవారు. పెళ్లి వేడుక  కయితే కొబ్బరాకుల పందిరి గడప గడపకు పసుపు కుంకాలు, మామిడి మండల తోరణాల తో సగం పెళ్లి కళ వచ్చేసింది. ఇప్పుడు పందిళ్ళు లేవు షామియానాలే. సిల్క్ కర్టెన్లు తో కొత్త అందం తెస్తున్నారు. అందమైన పూల మాలలు సర్వ రెండు రోజుల పాటు వాడకుండా చక్కగా వేడుకకు అందం తేవాలంటే ఓ సారి తోరన్ వీడియోస్ యాస్ చూడండి సాటిన్ రిబ్బన్ లు మెరిసే దారాలు, మిర్రర్ వర్క్, క్రోషెట్ వర్క్ తో తోరణాలుఎలా చేయాలో చక్కని వీడియోలున్నాయి. చేయడం పెద్ద కష్టం ఏం కాదు శ్రద్దగా చేయాలి. ఎన్నో వెరిటీ తోరణాలు ఇంట్లో వుండే గాజులు, పూసల తో కుడా చక్కని అల్లికలు అల్లెయవచ్చు. ఈ సారి ఇంట్లో ఏ పాపాయి పుట్టిన రోజు వస్తే ఈ యాప్ ఓపెన్ చేసి చక్కని తోరణాలు తయ్యారు చేయచ్చు.

Leave a comment