నిమిష నిమిషం ప్రపంచం శరవేగంతో మారిపోతుంది.ఎన్నో కొత్త వస్తువులు మార్కెట్ లో ప్రత్యక్షమై ఆధునికి టెక్నాలజీతో మనుషుల జీవితం సంతోషమయం అయిపోంది .జుంగల్ సన్ గ్లాసెస్ పేరుతో ఇప్పుడు మార్కెట్లో కోచ్చిన కళ్ళద్దాలు స్మార్ట్ ఫోన్స్ లాంటివి .ఈ స్మార్ట్ కళ్ళద్దాలు కళ్ళకు రక్షణ ఇవ్వటమే కాదు ,బయటికి వెళితే వీటి ద్వారా ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. పాటలు వినవచ్చు. బ్లూటూత్ సాయంతో కళ్ళద్దాలను ఫోన్ కు అనుసంధానం చేస్తారు. బయటినుంచి కాల్ రాగనేఉ ఫోన్ తీయకుండా కళ్ళద్దాలపై చేత్తో రాస్తే చాలు మాట్లాడేయవచ్చు. హెడ్ ఫోన్స్ అక్కర్లేదు. చెవులతో ఎలాంటి మిషన్ అక్కర్లేదు. నేరుగా శబ్ద తరంగాలు మెదడుకు చేరిపోతాయి. ఈ స్మార్ట్ కళ్ళద్దాలో ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వవచ్చు. ఇవి పని చేసే విధానం వీడియోల్లో చూడవచ్చు.