Categories
ఈ తరం అమ్మాయిలు ఇష్టంగా ష్రగ్ ని ఎంచుకొంటున్నారు.జాకెట్ లేదా కోట్ లా ఉండే ష్రగ్ చక్కని ప్రింట్ ఎంబ్రయిడరీ తో చక్కని డిజైన్ లతో వస్తున్నాయి. ఇవి పొట్టి ,పొడవు రకాలుగా టీ షర్టులు ,కుర్తీలు, ధోతీప్యాంట్లు,గౌన్లు ,స్కర్టులు ,పలాజోలు ,వేటి పైకి అయినా చక్కగా ఉంటాయి. ఇప్పుడు చీరెల పైకి పొడవాటి ష్రగ్ ఎంచుకోవటం ఫ్యాషన్ .దూపట్టా వద్దనుకొంటే డిజైనర్ ష్రగ్ బావుంటుంది. ఇకత్,కలంకారీ ,గుజరాత్ కచ్ వర్క్ చేసిన ష్రగ్స్ రోజువారీ వాడకం కోసం బావుంటాయి.ఖాది ,డెనిమ్ ,నెట్ ష్రగ్ జార్జెట్ ,సిల్క్ పైకి చక్కని ఎంపిక.