హటాత్తుగా జంప్ సూట్ ఫ్యాషన్ అయిపోయింది . ప్లే సూట్ ర్యంపర్ గా పిలిచే ఈ దుస్తుల్ని క్యాజువల్ ,పార్టీ,ఆఫీస్ వేర్ గా కూడా చక్కగా వేసుకోవచ్చు . డస్ట్ గ్రీన్ బ్లు మెరూన్ వంటి రంగులు ,బెల్ ,స్ట్రెయిట్ కట్ వంటివీ కాఫ్ లెంగ్త్ ,త్రీ ఫాడ్స్ రకాలన్నీ ఇప్పుడు అమ్మాయిలు ధరించేందుకు ఇష్ట పడుతున్నారు సిల్క్ కంటే లినెన్ ,నూలు ,రెనిమ్ వస్త్రశ్రేణి తో జంప్ సూట్లు సౌకర్యంగా ఉంటాయి .పైనుంచి కిందవరకూ ఒకే రకంగా కనిపించే ఈ డ్రస్ నడుము దగ్గర ఎలాస్టిక్ ఉంటుంది . స్టయిల్ గా కనపడేందుకు ఫ్యాబ్రిక్,మెటాలిక్ ఉండే బెల్ట్ లు కూడా పెట్టుకోవచ్చు . పెద్దపూల డిజైన్లు ఉన్న జంప్ సూట్స్ కూడా బావుంటాయి .

Leave a comment