Categories
ప్రతి ఇంటి ముంగిట్లోనూ తులసి చెట్టు ఉంటుంది. ఇందులో ఔషధ విలువలు తెలిసే పూర్వీకులు తులసి ని ఇంటి ముందు నాటి పూజలు చేయమని చెప్పి ఉంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,యాంటీ ఇన్ ఫ్లమేటర్ గుణాల కారణంగా తులసి జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరచగలుగుతుంది. తులసి ఆకు మరిగించి ,కషాయం లేదా టీ రూపంలో తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. తులసి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గించే గుణం చాలా ఎక్కువ .దగ్గు ,జలుబులతో దీర్ఘాకాలం బాధపడుతున్న వారు తులసి టీ తాగితే ఫలితం ఉంటుందంటున్నారు.