టూవీలర్స్ నడిపే మహిళల సంఖ్య ఎక్కువే. ఈ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే క్లచ్లు, బ్రేక్ లు ఇప్పుడు చెక్ చేయించుకుంటూ వుండాలి. వాహనానికి వుండే లైట్లు బ్రేక్ వేయగానే వెలుగుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో ముందు హెచ్చరిక వుండదు. కనుక రెయిన్ కోట్, క్యాప్ వెంట తెచ్చుకోవాలి. నీటిలో తడిసినా ఇబ్బంది పెట్టని డ్రెస్ వేసుకోవాలి. షూస్, చెప్పులు తగిన గ్రిప్ వున్నవి ధరించాలి. అతి వేగంగా వెళ్ళడం, హటార్తుగా బ్రేక్ వేయడం ప్రమాదం. పైగా నీళ్ళు చింది పక్కవాళ్ళ పైన పడటం కుడా సమస్యే. వాహనం నడిపెటప్పుడు చేతులో స్టీరింగ్, లేదా హ్యాండిల్ పైనే వుండాలి. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళడం ప్రమడంకరం.ఇక హెల్మెట్ తప్పని సరిగా వాడి తీరాలి. బాగా పరిచయం వున్న రోడ్ల పైననే వర్షం కురుస్తున్న సమయంలో ప్రయాణం చేయాలి. కొత్త రోడ్లపై ఎక్కువ గుంటలు గోతులు వున్నాయో తెలుసుకోలేరు కదా. ఇంటి నుంచి బయలుదేరే ముందే టైర్లు శుబ్రంగా వున్నాయో లేదో చూసి బయలు దేరాలి.
Categories