ఈ హోటల్ లో అడుగు పెట్టిన వాళ్ళని దయచేసి గోడలు నాకొద్దు అని చెప్తారట నిర్వాహకులు. ఎందుకంటే ఈ హోటల్ లోని గోడలు పైకప్పు మొదలు కుర్చీలు టేబుళ్లు వరకు అన్ని ఉప్పు తోనే నిర్మించారు. బొలీవియా లోని ‘పాలాసియో డి సాల్’ అనే హోటల్ ప్రపంచంలోనే ఏకైక సాల్ట్ హోటల్ విశాలమైన 12 గదులు డైనింగ్ హాల్ ఈత కొలను వంటి సకల సౌకర్యాలతో ఉండే ఈ హోటల్ ఉప్పుతో మెరిసిపోతుంది. ఇక్కడి ‘ సాలార్ డి ఉయుని ‘ ఉప్పు ఎడారి ని చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం దాన్ని కట్టారు. ఉప్పు  కరిగిపోకుండా ఉప్పు ఇటుకలని  ఫైబర్ గ్లాస్ కు జతచేసి ఇట్లా తయారు చేశారు.

Leave a comment