మనకి ఎంత గొప్ప క్రీడాకారిణులు ఉన్నారు. మేరీ కోమ్ సైనా నెహ్వాల్ పి. వి సింధు వాళ్లంతా దేశానికి గర్వకారణం అయినా క్రీడా ప్రపంచంలో స్త్రీ పురుష వివక్ష ఉంది.స్త్రీల క్రీడా ప్రతిభ మెరుగైంది కానీ క్రీడాకారిణులకు ఇచ్చే ప్రైజ్ మనీ పురుషులకు వచ్చే మొత్తం కన్నా చాలా తక్కువ.ఐ పి ఎల్ నే తీసుకుంటే పురుషులు ఆడేది అదే ఆట స్త్రీలు ఆడేది అదే కానీ క్యాష్ మాత్రం స్త్రీలకు తక్కువే ఎందుకీ వివక్ష అంటోంది సానియామీర్జా రెమ్యూనరేషన్లు సమానంగా ఇవ్వకపోవటం అంటే మా తపనను శ్రమను తక్కువగా చూపటమే. ఈ అసమానత్వం గురించి మాట్లాడకుండా రిటైర్ అయిపోతే మాకు మేం అన్యాయం చేసుకోవటమే అంటోంది సానియామీర్జా. ఇలాటి అసమానతలు స్త్రీలు పురుష వేతనాల విషయంలో అన్ని రంగాల్లోనూ ఉన్నాయి కదా.