మనం తినే ఆహారం మన స్వాభావాన్ని వెల్లడి చేస్తుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. సెన్సేషన్ సీకర్స్ ఎంతో ఇష్టమైన వాటిని తింటారు. వేడి వేడిగా ఇష్టపడతారు. స్పైసీ తింటారు, వేడి చాక్లెట్ తో పాటు ఇష్టమైనవి ఏవీ వదులుకోరు. అలాగే మనం తినే ఫుడ్ మన మూడ్ ని జ్ఞాపకాలను సూచిస్తుంది. ఒత్తిడి లో ఉంటే స్వీట్లు తింటారు. ఇలాంటి వాళ్ళు కంఫర్ట్ సీకర్స్ .కొందరు స్పాంటేనియాస్ ఈటర్స్ ఫుడ్ కి ప్లానింగ్ ఏమిటి అంటారు. అలా ప్లానింగ్ గావెళ్లి తినటం బోరింగ్ అంటారు. ఈ క్షణంలో అనుకోకుండా ఏదో తిని దాన్ని ఎంజాయ్ చేయటం వీళ్ళకి ఇష్టం, కొందరు భోజన ప్రియులు ఎప్పుడూ ఏం తినాలో అని ఆలోచిస్తారు. వీళ్ళు ఎక్స్ ట్రీమ్ వీళ్ళు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ద లేని యువత.

Leave a comment