దుస్తుల ఎంపిక విషయంలో తెలిసో తెలియకో చాలా పొరపాట్లు జరుగుతాయి. ఉదాహరణ కు కాస్త బొద్దుగా వున్నవాళ్ళు సన్నగా కనిపించేందుకు వదులుగా వుండే దుస్తులు ఎంచుకుంటారు. కానీ దీని వల్ల వయస్సు పెద్దదిగా కనిపిస్తుందని మరచిపోకూడదు. ఒక్క అంగుళానికి మించిన వాదులు లేకుండా వేసుకోవాలి. ట్రాక్ సూట్స్ వేసుకోవడం సౌకర్యంగానే వుంటుంది కానీ, అది జిమ్ కి కాస్తా దగ్గరలో వుండే దుకాణానికి తప్ప పనికి రాదు. దుస్తులు చిన్నవిగా బిగుతుగా అయినవి వేసుకోకూడదు. కాస్త బరువు పెరిగినా కొత్తవి కొనుక్కోవలసిందే. ఎప్పటివో జీన్స్ సౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తాయి కానీ అవి బాగా వాడినట్లు పాతవిగా అయిపోయినట్లు తెలిసిపోతుంటాయి. మాచింగ్ కు మరీ అంత ప్రాధాన్యత ఇవ్వక్కరలేదు. దుస్తులకు తగ్గట్టు వీలైతే, బాగ్, చెప్పుల వరకు చాలు. అలాగే అతిగా నగలు పెట్టుకోవడం కూడా అంత బావుండదు. ఏదయినా సింపుల్గా ఉంటేనే ఫ్యాషన్.
Categories