పురుషుల ఆలోచనలు మెదడులోంచి వస్తే మహిళల ఆలోచనలు మనసులోంచి వస్తాయంటున్నారు అధ్యయన కారులు. వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడూ లాజిక్ కు అందవు. మహిళల నాయకత్వంలో రుణ రహిత కంపెనీలు ఎక్కువని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తోంది. అహ్మదాబాద్ కు చెందిన పారు జయకృష్ణ అన్న యువతి  అసాహిసాంగ్ వన్ పేరుతొ ఒక ఎగుమతి సంస్థని ప్రారంభించిందట. నానాటికి ఆమెకు ఎగుమతి దిగుమతి చట్టాల పైనా వ్యాపారం పైనా  అవగాహన ఏవీ లేదు. పెట్టుబడి తక్కువ ఒకటే కారణం. అలాగే ఢిల్లీలో ఒక బహుళ జాతి కంపెనీ ఉద్యోగాన్ని వదులుకుని నీతి అన్న అమ్మాయి 36 రంగ్ పేరుతో గిరిజన కళాకృతులు అంతర్జాతీయ మార్కెట్ కు పరిచయం  చేసే బిజినెస్ పెట్టింది. ఢిల్లీ వదిలి నీతి సొంతూరు ఛత్తీస్గఢ్ లోని సొంతూరు వచ్చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. దీపా సోమన్  ఒక మార్కెట్ రీసెర్చ్ కంపెనీ పెట్టి ఇందులో మహిళలకే ప్రాధాన్యత అంటూ పైగా ఖచ్చితమైన పనివేళలు కూడా వుండవు. వాళ్ళు ఇంట్లోంచి కూడా పని చేయచ్చు నని చెప్పి చేసి చూపెట్టింది. వ్యాపారంతో పాటు సామజిక సేవ కలగలిపి వుంటోంది  మహిళలు ఏ ఉపాధి చెప్పటినా షి ఆల్వేస్ థింక్స్ బిగ్. దీర్ఘ కలయిక దృష్టి  మహిళకు స్వయంగా అబ్బిన లక్షణం.

 

Leave a comment