నీహారికా,

ఇప్పుడు పెద్దవాళ్ళే కాదు, పసివాళ్ళు కూడా చాల బిజీ షెడ్యూల్ లో ఉంటున్నారు. వాళ్ళకి సాయం కాలం ఇంటికి రాగానే తోటి పిల్లలతో కాసేపు గడిపే అవకాశం బంద్. అయితే ధృడమైన స్నేహలుంటేనే పిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వారికి యంగ్సైయిటీ, డిప్రెషన్ వంటి జబ్బులు దగ్గరకు రావు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారు పెంచుకొనే స్నేహాలు వారిని ధృడంగా చేస్తాయట. మంచి స్నేహలున్న హైస్కూల్ విద్యార్దులు  మానసిక పరమైన అంశాల్లో ఎంతో పెరుగుదల చూపిస్తారు. స్కూల్ రోజుల్లో కనుక వాళ్ళు ఒంటరిగా స్నేహితులు లేకుండా పెరిగితే భవిష్యత్ లో తీవ్రమైన సోషల్ యంగ్సైయీటీకి గురయ్యే అవకాశాలు బాగా ఉన్నాయట. యువతీ, యువకుల్లో పెరిగిన యంగ్సైయీటీ, సోషల్ యాక్సిపెన్సీ, స్వయం అంగీకారం, ఒత్తిడి లక్షణాలను బట్టి వారిలో స్నేహితులు ఎక్కువగా లేని వారిలోనే మార్పులు ఉన్నాయని మానసిక ఆరోగ్యం సరిగా లేదని నిపుణులు గుర్తించారు. ఉద్రేక స్వభావంతో ఉండటం కూడా ఏకాంతంగా ఉన్న కారణంగానే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అంచేత తల్లితండ్రులు తమ పిల్లలు మంచి స్నేహాలు చేసేలా ప్రొత్సహించాలని అద్యయనకారులు సూచిస్తున్నారు.

Leave a comment