Categories
కాస్తా ప్రపంచం అర్ధం చేసుకోనే వయస్సు వచ్చే పిల్లలను బయట వాళ్ళ ముందు పదే పదే అవమానించడం, తిట్టడం చేయోద్దు అంటున్నరు ఎక్స్ పర్ట్స్ . నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కి సంబందిచిన పరిశోధకులు ఇటివల జరిపిన పరిశోధనలో హేళనకు గురవుతు అవమానపడిన పిల్లలు వత్తిడిని గ్రహించి హార్మోనులు ఎక్కువ అవుతున్నయి అని తేల్చారు.వాళ్ళలో అధ్యాయన శక్తి తగ్గిపోవడం,శారిరకంగా తరచు అనారోగ్యానికి గురికావడం గుర్తించారు. టినేజిలోని పిల్లలను తల్లిదండ్రులు చిన్నపిల్లలు అనే ఉద్దేశ్యంతో ఇంట్లో అందరి ముందు కోప్పడిన .దండిచిన వాళ్ళు చాలా సిరియస్ గా తీసుకుంటారు అని వాళ్ళని లాలనతో ,ప్రేమతో మాట్లడి దారికి తెచ్చుకోవాలి కాని వాళ్ళతో విసురుగా వ్యవహారించ వద్దు అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.