జీవితంలో ఎప్పుడూ సంతోషాలే  వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం. సినీ నటి త్రిష ఈ మధ్య కాలంలో హండ్రెడ్ హ్యాపీ డేస్ ఛాలెంజ్ తీసుకుందిట. ఈ ఛాలెంజ్ కు వప్పుకునే వంద రోజుల పాటు ఎలాంటి విషయానికీ బాధ పడకుండా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి. ప్రతి ఒక్కరితో సంతోషాన్ని ఆత్మ విశ్వాసాన్ని సానుకూల దృక్పధాన్ని పెంచే దృష్టితో హండ్రెడ్ హ్యాపీ డేస్ సంస్థ ఈ పోటీ ని నిర్వహిస్తోంది. అందరితో ప్రేమగా ఉత్సాహంగా ఉండాలని తీర్మానించుకుని ఈ ఛాలెంజ్ తీసుకున్నా అన్నారు త్రిష. గతంలో ఈమె నో మేకప్ ఛాలెంజ్ తీసుకుని చాలా రోజులపాటు మేకప్ లేకుండానే బయట కార్యక్రమాల్లో పాల్గొన్నారట. ఇలాంటి ఛాలెంజ్ లు వప్పుకుంటే జీవితంలో నిరాశ అన్న పదం కాస్త దూరం జరుగుతుందేమో !

Leave a comment