Categories
ఒక ఆరోగ్య ప్రయోగం లో భాగంగా స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రిజ్ ఫ్లామిని 500 రోజులు 260 అడుగులు లోతు గుహలో ఒక్కతే గడిపి బయటకు వచ్చింది.2021 నవంబర్ 21న స్పెయిన్ లోని గ్రనాడ పట్టణం సమీపంలోని ఒక గుహలో అడుగుపెట్టి ఒకటిన్నర సంవత్సరం ఒంటరిగా గడిపిన బీట్రిజ్ కదలికలు కనిపెట్టేందుకు శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగం చేశారు. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్, వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీరం మానసిక స్థితుల్లో వచ్చే మార్పు అధ్యయనం చేస్తున్నారు శాస్త్రజ్ఞులు. ఎక్కువ రోజులు గుహలో గడిపిన మహిళగా బీట్రిజ్ ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకోంది.