రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కొన్ని రకాల ఆహారపదార్ధాలు ఈ సమస్యను తగ్గిస్తాయంటున్నారు వైద్యులు. ఏషియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజికి చెందిన నిపుణులు చెప్పారు. బొప్పాయి ఆకుల్ని మరిగించి ఆ నీటిని రోజుకు రెండుసార్లు తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయని సలహా ఇస్తున్నారు. క్లోరోఫిల్ ఎక్కువగా ఉండే గోధుమగడ్డి వల్ల కూడా ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. అరకప్పు గోధుమగడ్డి రసంలో కాస్త నిమ్మరసం కలిపి తాగమంటున్నారు. దానిమ్మ గింజలు, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే చేప నూనె,గుమ్మడికాయ రసం,విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలు, ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఈ వర్షాల రోజుల్లో అనారోగ్యాలు రావు.
Categories