వర్షాలు కురిస్తే ఇల్లంతా తేమగా, తడిగా వుంటుంది. ఇప్పుడు తలుపులు వేసి వుండే బీరువాలు, అరల్లో పెట్టుకొనే నగలు, దుస్తులు, పుస్తకాలు, చెప్పులు అన్నింటికి సమస్య చెమ్మ చేరితే చెద పురుగులు పడతాయి. పుస్తకాల బీరువాలో బుక్స్ బయటకు తీసి లోపల కిరోసిన్ రాసి తలుపులు తీసి ఉంచితే కొద్ది సేపటికి వాసన పోతుంది. అప్పుడు పుస్తకాలు సర్డుకుంటే చెదలు సమస్య రాదు. ఇక ప్లాటినం బంగారు నగలు వర్షంలో గనుక తడిస్తే వెంటనే వాటిని పొడి టవల్ తో తుడిచి గాలికి ఆరనిచ్చి బద్రం చేయాలి. టిష్యు పేపర్ లో చుట్టి బీరువాలో బద్రపరిస్తే బావుంటుంది. వెండి నగలు చేమ్మకు కాంతి లేకుండా అయిపోతాయి. ఒక్కో సారి నల్లగా అయిపోతాయి కుడా. కప్పు నీళ్ళలో కాస్త టూత్ పేస్ట్ వేసి అందులో వెండి నగలు వేసి సాసేపతి తర్వాత బ్రష్ తో శుబ్రం చేస్తే ఎప్పటిలా మెరుస్తాయి.
Categories