యోగా కి వయసుతో సంభందం లేదు అంటారు బ్రిటిష్ పరిశోధికులు. ఏడింబరొ విశ్వవిద్యాలయ పరిశోధకులు యోగా ప్రభావం పైన, శరీరం పైన,మనుసు పైన ఎలా ఉంటుంది. అనేది పరిశోధనలు చేశారు. పదినెలల కాలం యోగాను 30 నిమిషాల నుండి 90 నిమిషాల పాటు చేయించారు. ఈ యోగా సాధనలో ఈ ప్రయోగం లో పాల్గోన్న 60 దాటిన వారిలో పలు అనారోగ్య సమస్యలు తగ్గు మొఖం పట్టాయి. యోగా తో కండరాలు బలం పుంజుకొని తూలి పడిపోవడం కాళ్ళు చేతులు పట్టు తగ్గడం తగ్గాయి. నడుము కింది భాగానికి బలం వచ్చింది. ఏ వయుసు వారికైనా యోగా మంచిదే నని ఈ పరిశోధన తేల్చింది.

Leave a comment