Categories
చర్మం యవ్వన వంతంగా మృదువుగా ఉండేందుకు క్రీంలు పూతలు కంటే ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చర్మంలో కొలాజెన్ శాతం పెంచుతాయి . క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ చర్మానికి హానిచేసే అతి నీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కాపాడుతుంది . రోజుకు క్యారెట్ తింటే మేలు కొబ్బరినీళ్ళు శరీరంలో డీ హైట్రేషన్ తగ్గించి చర్మానికి తేమ ఇస్తాయి . టోఫు పనీర్ లో ఉండే మాంసకృత్తులు చర్మాన్ని మృదువుగా మార్చేస్తాయి . నిమ్మజాతి పండ్లలో ఉండే సి -విటమిన్ ఎండనుంచి చర్మాన్ని కాపాడుతుంది . కీరదోసలో ఉండే సిలికా అనే పదార్ధం చర్మాన్ని తాజాగా మార్చేస్తుంది .