Categories
శిరోజాల ఎదుగదలను,మృదుత్వాన్ని కాపాడేందుకు హెయిర్ స్టయిలిస్టులు హెయిర్ వాష్ చేసి ప్యాక్ వేసి స్టయిలింగ్ చేస్తారు. అది ఇంట్లోనూ చేయవచ్చు. ఎదైనా అప్లయ్ చేసేందుకు ముందు వేడి నీరు వాడితే శిరోజాలు, మాడు రంధ్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు ఏదైన మాస్క్ అప్లయ్ చేయాలి. ఏ మాస్క్ అయినా జుట్టులోకి చొచ్చుకుపోయేందుకు తగినంత సమయం పడుతుంది. ఓ అరగంట పాటు హెయిర్ మాస్క్ ను అలా వదిలేస్తే అది ఆరిపోతుంది అప్పుడు వెంటనే దాన్ని కడిగేయాలి. క్యారెట్లు, బీట్ రూట్లు ,టమోటాలు ,కీరా కూడా వేటికవి విడివిడిగా గుజ్జు చేసి జుట్టుకు మాస్క్ లో వాడవచ్చు. ఇవన్ని శిరోజాలకు మేలు చేసేవి.