Categories
కొన్ని అధ్యయనాలు మనకి హెచ్చరికలు లాగా పనికొస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి వీటిని వెంటనే పట్టించుకోవాలి కూడా. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో బాగా వేయించిన పదార్థాలు ఆరోగ్యానికి హాని మాత్రమే కాక స్త్రీలలో అకాల మృత్యవుకు కారణం అవుతున్నాయని తేలింది. బాగా వేయించిన చికెన్, ఫిష్ వంటివి తరుచు తింటూ ఉంటే స్త్రీలు గుండె జబ్బుల భారీన పడే అవకాశాలు 21 శాతం ఎక్కువ అని అధ్యయనంలో వెల్లడైంది. వేపుడు పదార్థాలతో వచ్చే ఊబకాయం బిపి సమస్యల వల్లనే ఆడవాళ్ళకు మృత్యువుకి దగ్గర చేస్తున్నాయని అధ్యయనకారులు స్పష్టంగా చెపుతున్నారు.