Categories
ఏవా ఫెర్టిలిటీ ట్రాకర్ రాత్రి సమయంలో చేతికి పెట్టుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కెరీర్, ఒత్తిడి, కాలుష్యం తరచూ, మారిపోయే పనివేళలు స్త్రీల విషయంలో నెలసరి పైన ప్రభావం చూపెడతాయి. దీనితో సంతానోత్పత్తి విషయం లోనూ సమస్యలు వస్తాయి. ఇందుకు పరిష్కారంగా ఏవా ఫెర్టిలిటీ ట్రాకర్ వచ్చింది. ఈ ట్రాకర్ నెలసరి అండం విడుదల అయ్యే సమయం నుంచి ప్రెగ్నెన్సీ లో మార్పుల వరకు తెలియజేస్తుంది. శరీర ఉష్ణోగ్రత రేట్లు గుండె చప్పులు మొదలైన అంశాల ఆధారంగా డేటా నమోదు చేస్తుంది. నెలసరి కి సంబంధించిన సమస్యలే గాక ఖచ్చితమైన గర్భధారణ సమయాన్ని సూచిస్తుంది. ఇదో సిలికాన్ ఫోన్ యాప్ తో అనుసంధానమై పని చేస్తుంది.