ఈ మండే ఎండల్లో వడగాల్పులతో దాహం తో గొంతు ఎండకు పోతుంటే పండ్లు, కూరగాయలు,రసాలు తిసుకోమంటున్నారు న్యూట్రిషనిస్టులు. క్యారెట్ తియ్యని రుచితోనే వుంటుంది. ఈ జ్యూస్ తో గుండె జబ్బులు నివారించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ది చేయడంలో తోదపడుతుంది. వేసవికి దేహ శాంతి కూడా. అలాగే బీట్ రూట్ రసం కాలేయాన్ని రక్షిస్తుంది. వయామం చేసినప్పుడు దానికి అనుగుణంగా శరీరం స్పందించే తీరును కూడా మెరుగు పరుస్తుంది. బీట్ రూట్. ఇందులో వుండే ఫైటో న్యుట్రీయంట్లు రక్తం గడ్డకట్టటాన్ని అధిక కోలెస్ట్రోల్, అధిక రక్త పోటును తగ్గిస్తుంది. దానిమ్మ రసం యాంటీ ఫంగల్, యాంటీ బక్టిరియర్ గా పని చేస్తుంది. రక్త హీనత సమస్య తగ్గిస్తుంది. టొమాటోలో లైకోపిన్ ఎక్కువగా వుంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో కీలకంగా పని చేస్తుంది. ఇన్ని రకాల పోషకాలతో పాటు వేసవి తాపం హరించే శక్తి ఈ పండ్ల రసాలలో ఎంతో ఎక్కువ వుంది.
Categories