మొక్కలని పెంచటం ప్రాణావసరం ,ఇల్లు ఇంట్లో వాళ్ళు చల్లగా ఆరోగ్యాంగా ఉండాలంటే మొక్కలను పెంచాల్సిందే . ఇళ్ళల్లో అలంకరణ కోసం ఎన్నో ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు . ఇంటీరియర్ డెకరేటర్లు కూడా ఖరీదైన అందమైన వస్తువులను ఇంటి అందాన్ని పెంచేందుకు వాడతారు . కానీ కొన్ని తీగజాతి మొక్కల్ని పెంచితే ఇల్లు మరింత అందంగా తాజారుపంలో కనిపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మల్లి జాజి ,మాలతి ,గోకర్ణ ,శంఖుపుష్ప,లిల్లీ ,మనీప్లాంట్ ,బోగన్ విల్లా ,యల్లమంద క్రేపర్ ,రంగూన్ ,క్రేపర్ ,మండే విల్లా వంటి తీగజాతి మొక్కలు అలంకరణకు ఎంతో బావుంటాయి . చాలా వరస తీగజాతి మొక్కలకు అందమైన సువాసనలు వెదజల్లే చక్కని పూలు పూస్తాయి . వీటిని అందమైన కుండీల్లో పెంచి కిటికీలకు పాకించవచ్చు . అసలు పూలు పూయక పోయినా తీగ మొక్కలు కొన్ని చాలా బావుంటాయి .

Leave a comment