40 వేల కోట్ల విలువైన సంపద తో అత్యంత సంపన్నురాలైన వ్యాపారవేత్తగా చరిత్రకెక్కారు ఫల్గుణీ నాయర్‌. ఆమె చేస్తున్న సౌందర్య సాధనాల వ్యాపారం పేరు నైకా అంటే అభినేత్రి లేదా ఆదర్శ మహిళ అని అర్థం. 2013లో రోజుకు వెయ్యి ఆర్డర్ లు ఉంటే ఈరోజు లక్ష ఆర్డర్ లు ఉంటాయి చర్మ సౌందర్యం, శిరోజ సంరక్షణ ఆరోగ్య పరిరక్షణ ఫ్యాషన్ దుస్తులు మేకప్ సామాగ్రి అత్తరు సెంట్లు  వంటి నాలుగు వేల రకాల ఉత్పత్తులు విక్రయిస్తోందీ సంస్థ. ఆన్ లైన్ లోనే కాదు పట్టణాల్లో 200 షో రూమ్ లో 2500 మంది ఉద్యోగులు నాలుగు వేల కోట్ల టర్నోవర్ తో పదేళ్ల లో ఫల్గుణీ సాధించిన విజయానికి రూపం నైకా.

Leave a comment