నీహారికా,

స్త్రీలు వంటరిగా ప్రయాణం చేయటం సేఫ్ కాదనిపిస్తోంది అంటున్నావు కానేఎ ఇప్పటి రోజులకు అవసరం కదా. విదేశీ ప్రయాణాలు చేయవలసిన అవసరాలు స్త్రీల ముందుకు చేరాయి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ స్త్రీలు విదేశాలు చుట్టేస్తున్నారు. ఆరోగ్యం, భద్రత గురించి ఆలోచించాల్సిందే అనుకో. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటే సురక్షిత, సక్సెస్ ఫుల్ ట్రిప్స్ వేసుకోవచ్చు. మంచి ప్లానింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఏదీ పోగొట్టుకోకుండా దొంగతనాలు జరగకుండా నగదు, లగేజ్ తగు మాత్రంగా తీసుకోవాలి. సురక్షితమైన అకామడేషన్ కోసం ముందస్తు ఏర్పాట్లు ఉండాలి. ఏదైనా దుర్గటన జరిగితే స్థానిక పోలిస్ వారితో సంప్రదించే రిపోర్ట్ ఫైల్ చేయవలసిన అవసరాల, వివరాలు గురించి ముందే తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎప్పటికప్పుడు టచ్ ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నది తెలియ జేస్తూ ఉంటె వంటరి ప్రయాణాల భయం దేనికి. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి కదా.

Leave a comment