అన్ని ప్రభుత్వాలు, సంస్థలు ఒక పరిమితమైన రిటైర్ మెంట్ వయస్సు నిద్దేసించాయి. ఇంత ఆ వయస్సు దాటి పని చేస్తే నైపుణ్యం తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అయినా రిటైర్మెంట్ తర్వాత తమ సమాధ్యాన్ని బట్టి ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళలో శారీరక క్షిణత, రుగ్మతలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్ళ తర్వాత వయసున్న స్త్రీ పురుషుల పై ఈ అధ్యాయినం కొనసాగింది. అధికారకంగా రిటైర్ అయినా తాత్కాలిక ఉద్యోగాల్లో కొనసాగుతున్నామని చెప్పుకునే వాళ్ళల్లో రక్త పోటు, డయాబెటీస్, కాన్సర్, గుండె జబ్బులు వంటివి ఖాలీగా వున్న వాళ్ళ కంటే తక్కువేనని పరిశోధకులు గుర్తించారు. పని చేసే వాళ్ళు గదిలో పచార్లు చేయడం, పడుకోవడం, నిద్ర లేవడం డ్రెస్సింగ్, తినడం వంటివి ఇలాంటి మార్పు లేకుండా ఉత్సాహంగా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ఆర్ధిక వెసులుబాటు కోసమో లేదా తీరికగా వుండటం ఇష్టం లేదనో జాబ్స్ చేసే వాళ్ళలో మానసిక శారీరక ఆరోగ్యాలు బాగున్నాయని, వాళ్ళు ఉత్సాహంగా వున్నారని, అలా వుండటమె సరైన పని అని రిపోర్ట్ తేల్చింది.
Categories