కొత్తగా తల్లులైన వారి దగ్గర రెండు కంప్లైంట్స్ వింటూ వుంటాం. బరువు పెరిగాము ఎలా తగ్గించుకోవడం , పొట్ట ఉబ్బెత్తుగానే వుంది ఎం చేయాలి అని ఆరోగ్యవంతమైన వెయిట్ ని మెయిన్ టైన్ చేసినా ఒక్కో సారి పొట్ట హెవీగా ఉబ్బెత్తుగా వుంటుంది. కనీసం ఆరు నెలల పాటు బరువు గురించి ఆలోచించకూడదు. పొట్ట పైన ఎలాంటి వత్తిడి తేకూడదు. పొట్ట లోపల టెండర్ గా లోపల పచ్చిగా వుంటుంది. డైట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చక్కగా వాకింగ్ చేయొచ్చు. పండ్లు కూరలు వ్బగా తినచ్చు. కొవ్వు చక్కెరలు తగ్గిస్తూ రవలి. నీరు బాగా తాగాలి. సాధారనంగా రోజులు గడిచే కొద్దీ ఉదరం దగ్గర బరువు తగ్గి స్లిమ్ గా అయిపోతారు. ఇక తర్వాత ఎంతకీ బరువు తగ్గడం లేదనిపిస్తే ట్రైనర్ సలహాతో అబ్డామినల్ ఎక్సర్ సైజులు చేయొచ్చు. ముందుగా డాక్టర్ సలహా తో బిడ్డ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతె మంచి ఎక్సర్ సైజులతో బరువు తగ్గించుకోవచ్చు.
Categories