ఫ్యాషనిస్టులు,ఫిలాసఫర్స్ ఏంచెబుతారంటే కోరల్ కలర్ బద్దకాన్ని డిప్రెషన్ న్ని తగ్గించి చురుకుదనాన్ని సృష్టిస్తుంది అంటారు. పాశ్చత్య దేశాల్లో ఈ కోరల్ కలర్ థీమ్ కలర్ గా పెళ్ళి వేడుక దుస్తుల్లో,వేదిక అలంకరణల్లో ఎక్కువగా కనిపిస్తుందట.ఎక్కడైన ఈ కలర్ షేడ్స్ అందంగానే ఉంటాయి.ఈ రంగు ధగధగ లాడే దీప కాంతుల మధ్యనే పగటి వేళల్లో కూడా అందంగా ఉంటుంది. పార్టీ వేర్ తో పాటు క్యాజువల్ వేర్ గాను ఈ పగడపు రంగు ఫ్యాషన్. నీలి,పచ్చ కలిసిన నెమలి పించం రంగు ,కోరల్ కలర్ కి మంచి కాంభినేషన్ అంటారు స్టైలిస్టులు. ఈ పింకిష్ ఆరెంజ్ కలర్ లో ఉండే పగడాల నగలు ఇప్పుడు కొత్త ఫ్యాషన్.