వళ్ళు నొప్పులోచ్చేంత కాఠినంగా చేస్తేనే వ్యాయామం లో ఫలితాలు ఉంటాయి అనుకోవడం పొరపాటు. నొప్పి అనేది మాజికల్ పై పెరిగిన వత్తిడికి సూచన వీలైనంత వరకు దాన్ని సహజ పద్దతుల్లో తగ్గించాలి కానీ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఆరోగ్యకరమైన బరువుని మెయిన్ టెయిన్ చేసేందుకు కనీసం 30 నిమిషాల నుంచి 60 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులు చేయాలి. అన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయికంటే ఎంత సేపు వ్యాయామం చేసాము అన్ని విషయం చాలా ముఖ్యం. చల్లగా, అతి వేడిగా వుండే వాతావరణం లో కాక తెల్లవారు జామున, సాయంత్రాలు మాత్రమె వ్యాయామాలు చేయడం ఆరోగ్యకరం. హార్ట్ రేట్ క్యాలరీల ఖర్చు విషయం పై అవగాహన పెంచుకోవాలి. నేలపైన పడుకుని చేసే స్ట్రెచ్, క్రంచెస్ కు నిపుణుల పర్యవేక్షణ కావాలి. లేని పక్షంలో బ్యాక్ పెయిన్ సమస్యలు వస్తాయి. జిమ్లో షోల్డర్ కు వెయిట్స్ తో కఠినమైన వ్యాయామాలు చేసేటప్పుడు లోయర్ బ్యాక్ సపోర్ట్ వాడాలి. వైద్య సలహాపైనే వ్యాయామాలు చేయాలి.
Categories