ఆరున్నర సంవత్సరాల పాటు మాక్స్ వెల్ ప్రపంచ యాత్రలో గడిపింది ఆమె 32 వేల కిలోమీటర్లు నడిచారు. 30 ఏళ్ళ వయసులో విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతూ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్న మాక్స్ వెల్ ప్రపంచం తో ప్రకృతి తో మమేకం కావాలని నిర్ణయించుకొని 2013లో ఒంటరిగా కాలినడకన ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రయాణం మొదలుపెట్టారు. ఈ లోగా ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు యాత్రానుభవాలు మాత్రం తెలుసుకొంది మ్యాక్స్. క్యాంపింగ్ కు అవసరమైన పరికరాలు, డి హైడ్రేటెడ్ ఆహారం మిలిటరీ గ్రేడ్ వాటర్ ఫిల్టర్ నాలుగు కాలాలకు అవసరమయ్యే 50 కేజీల దుస్తులు మాత్రమే సర్దుకొంది క్యాంప్ బెల్ ఈ ప్రయాణం ఆమెకు ఎన్నో అపురూపమైన అనుభవాల్ని ఇచ్చింది ఒక చోట ఒక కొత్త విషయం నేర్చుకుంది .ఇటలీ లోని ఒక గ్రామంలో వారి సాంప్రదాయ వంటకాలు జార్జియాలో తేనెపట్టు పెంపకం, మంగోలియా లో సిల్క్ రోడ్ పై ఒంటెలను మచ్చిక చేసుకోవటం, న్యూజిలాండ్ లో చెక్కలు కోయటం లాంటివి ఎన్నో సంతోషకరమైన అనుభవాలున్నాయి. ఈ ప్రయాణంలో 30,000 వేల డాలర్లు విరాళాలుగా సేకరించికొన్నది మ్యాక్స్ తన ఆప్తమిత్రురాలు ఎలైస్ ఇంటి దగ్గర 2020 డిసెంబర్ 16న ఆమె ప్రయాణాన్ని ముగించాం.ఇప్పుడామె తన ప్రయాణం అనుభవాల పుస్తకం రాస్తోంది. ఒక యువతి ఒంటరిగా నడుస్తూ ప్రపంచ యాత్రకు సంకల్పించడం ఎంతో స్ఫూర్తిదాయకమైన కథ.

Leave a comment