Categories
సాధారణంగా అన్ని చెట్లు,పూలు,పండ్లు కలప వంటివి ఇస్తాయి ‘టెర్మినాలియా ఎలిప్టికా’ అన్న చెట్టు మటుకు వీటితో పాటు నీళ్లు కూడా ఇస్తుంది.మొసలి బెరడు చెట్టు అని పిలిచే ఈ చెట్టు బెరడు కాస్త తొలిగిస్తే చాలు ఫోర్స్ గా బలమైన ధరతో నీళ్లు వస్తాయి. వర్షపు నీటినీ,భూమిలోని నీటినీ వీటి కాండల్లో నిల్వ వుంచుకొనే ఈ చెట్టు భారతదేశం తో పాటు నేపాల్,బాంగ్లాదేశ్,మయన్మార్,థా యిలాండ్,కంబోడియాల్లో ఉంటాయి. దక్షణ భారత దేశంలో పొడి,తేమ, ఆకురాలే అడవల్లో ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు ఈ నీళ్లను దాహం తీర్చుకొనేందుకు కడుపు నొప్పికి ఔషధంగా వాడుతారు.