ఫ్యాషన్ డిజైనర్ల దృష్టి ఎప్పుడు ట్రెండింగ్ పైనే ఉంటుంది. ఇవ్వాళ ప్రపంచానికి ఇష్టమైంది ఏమిటి ఆడవాళ్ళు దేన్ని ఇష్టపడతారు.ఏది వాళ్ళ సౌకర్యం,ఏది ఫ్యాషన్ సాంప్రదాయం కలగలిసిన ఫ్యాషన్ ఎలా ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ పోతే ఒక కొత్త డిజైన్ మార్కెట్లో వచ్చి వాలుతుంది. అలాగే వచ్చింది లెహంగా చీర. ఉత్తరాది గాఘ్ర, దక్షిణాది ఓణి అదే సమయంలో నాజుకైన చీరె ఈ మూడు ఒకేసారి కనిపించేలాగా లెహంగా చీరె వచ్చింది. కంచిపట్టు,పోచంపల్లి ఎంబ్రాయిడరీ నెట్ ఒకటనిలేదు. ఏ వస్త్ర శ్రేణిలో అయినా లెహంగా చీరే,లంగా,ఓణి ఈ మూడింటి కలబోత ఈ ఫ్యాషన్ డిజైన్ అవుట్ పుట్.

Leave a comment