Categories
రెండు పండ్లు..18 లక్షల రూపాయలు. మీరు సరిగ్గానే విన్నారు జపాన్ లో పండిన యుబరి కింగ్ మెలన్ పండ్లను పోకో సప్పోరో ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీ అక్షరాల 18 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రికార్డుల్లోకి ఎక్కింది. జపాన్ లోని యుబరి అనే ప్రాంతంలో ఈ పండ్లు పండిస్తారు. ఈ పండ్లకు బ్రాండింగ్ తేవటం లో యుబరి రైతులు వందేళ్ళ కష్టం ఉంది.రైతులు అమెరికన్ వంగడానికీ యూరోపియన్ వంగడాన్ని కలిపి కొత్త రకమైన కర్జూజ ను సృష్టించారు.గుండ్రని తియ్యని కర్జూజ రుచి లో కండల లో కూడా మిగతా వాటికి భిన్నంగా ఉంది. ఇక్కడి అగ్నిపర్వత నేలలే ఆ పండు రుచికి కారణం అంటారు మెలన్ రైతులు. యుబరి అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ సొసైటీ గా మారారు. ఈ పండ్లను నేరుగా మార్కెట్ లో అమ్మరు అన్ని అమ్మకాలు సంఘం తరఫున ఉంటాయి గ్రీజు హౌసుల్లో తగిన ఉష్ణోగ్రత దగ్గర వీటిని పండిస్తారు. పండు ఎదిగేప్పుడు రైతులు గ్లౌజులు లేకుండా వీటిని ముట్టుకోరు తీగకు పిందె పడగానే మిగతా ఆకులను తొలగించి దానికి పూర్తి పౌష్టికాలు అందేలా చూస్తారు. సంఘానికి వచ్చే ప్రతి పండు సైజు రంగు వాసన పట్టి ధరను నిర్ణయిస్తారు. మే నెలలో పండ్లను వేలం వేస్తారు. పెద్ద పెద్ద బిజినెస్ సంఘాలు ఇందులో పాల్గొంటాయి. ఈ ఏడాది కూడా వేలం జరిగింది రెండు పండ్లు ఖరీదు 18 లక్షలు. రుచి అద్భుతం అంటున్నారు తిన్న వాళ్ళు ఇంత ఖరీదుకు పండ్లు అమ్ముడవ్వటం మాత్రం వింతల్లో కల్లా వింత కదా !