Categories
సాధారణంగా గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు కానీ మామూలు కన్నా ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఉండవలసిన దానికన్నా అధిక బరువు పెరుగుతారని ఈ బరువు కడుపులో ఉన్న శిశువు మెదడు, గుండె పైన ప్రభావం చూపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.రెండు లక్షల మంది గర్భవతుల పైన చేసిన ఒక ఆన్ లైన్ అధ్యయనంలో ఎక్కువ ఆహారం తీసుకొన్న గర్భిణీలు ఎక్కువ బరువున్నారు. బరువు ఎక్కువగా ఉన్న తల్లుల పిల్లల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు గుర్తించారు. గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తల్లో అధిక బరువు నియంత్రణ ముఖ్యమనే దాన్ని ఎప్పటికప్పుడు గుర్తించాలని తప్పనిసరిగా శరీర వ్యాయామం ఉండవలసిందే అని పరిశోధకులు స్పష్టం చేశారు.