ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పాత టైర్ల తో కొత్త రూపంలోకి తెచ్చేసింది పూజా రాయ్. ఆమె ఒక ఆర్కిటెక్చర్. ఆమె చేసిన స్కూళ్ళలో పిల్లలకు ఆడుకునే ఆట వస్తువులే లేవు .పిల్లలు ప్లేట్లతో విరిగిపోయిన బ్యాట్ల తో ఆడుకోవడం చూశాక ఆమెకు కొత్త ఆలోచన వచ్చింది. పాత టైర్లతో వాళ్లకోసం ఆట వస్తువులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం వంద మిలియన్ టన్నుల పాత టైర్లు వృధాగా పడేసారు. వాటిని ఆట స్థలానికి కావలసిన ఉపకరణాలుగా మారిస్తే పర్యావరణానికి కూడా సహాయం చేయవచ్చు కదా అని ఆలోచించింది పూజా రాయ్ . డజన్ల కొద్దీ పాత టైర్లను సేకరించి శుభ్రం చేసి గట్టిదనాన్ని పరిశీలించి ఆట వస్తువులుగా మలిచి రంగులతో పెయింట్ చేయించింది. ఆమె స్థాపించిన ఎన్జీవో పేరు ‘ఆంథిల్’ ఆ పాత టైర్లతో దేశమంతా 800 మంది వాలంటీర్ల తో 275 ప్లే స్కేప్ లను కొత్తగా నిర్మించింది. బెంగుళూరు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు పిల్లలు ఆడుకునేందుకు టైర్లతో చేసిన ఆట వస్తువులు ఉన్నాయి. స్వింగ్ చేసిన టైర్లు క్యూబ్స్ ఏనుగు గుర్రాల వంటి నమూనాలు సొరంగాలు జింగిల్ జిమ్స్ వంటివి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకు అందమైన బాల్యంలో ఆట ఒక భాగం. పూజా రాయ్ ఆలోచన పిల్లల్లో ఉత్సాహం నింపింది.
Categories