Categories
30 ఏళ్లు దాటాక తెల్లవటం చాలా కష్టం అనుకుంటారు కానీ అమ్మతనాన్ని ఆస్వాదించేందుకు వయసు అడ్డంకి కాదు అంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అర్చన ధావన్ బజాజ్. ప్రెగ్నెన్సీ నిర్ధారణ తర్వాత తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించినా వైద్యులకు చెప్పాలి. గర్భం దాల్చిన తర్వాత ఎక్కువ మోతాదులో కాల్షియం, ఐరన్, విటమిన్- డి, ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతాయి. ఇవన్నీ ఆహారంలో లభించేలా చూసుకోవాలి గర్భిణీగా ఉన్నప్పుడు కావలసిన బరువు పెరగటం బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడుతుంది అంతేకాదు కాన్పు అయ్యాక అదనపు బరువు తగ్గటం తేలికే అవుతుంది. తేలికైన శరీర వ్యాయామాలు కండరాలు దృఢంగా మారి కాన్పు తేలికగా అయ్యే శక్తి వస్తుంది.