Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2021/09/download-4.jpg)
ఇండోర్ లో ఇప్పుడు రెండు పింక్ బస్ లు తిరుగుతున్నాయి. బస్ డ్రైవర్ నుంచి ప్రయాణికుల దాకా అందరూ మహిళలే బోపాల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కారిడార్ లోని 11.56 కిలో మీటర్ల పరిధిలో ఈ బస్సులు తిరుగుతాయి. పాటనీ పూరా కు చెందిన 35 ఏళ్ల రితూ నర్వాల్ మొదటి డ్రైవర్ కాగా 25 ఏళ్ల అర్చన కాటారే రెండో డ్రైవర్ ఇండోర్ లో ఇప్పటికే ఆటో, క్యాబ్ డ్రైవర్ లుగా మహిళలే రాణిస్తున్నారు. 2019 లో ప్రారంభించిన ఈ పింక్ బస్సులలో ఇప్పటి వరకూ కండక్టర్ లుగా మాత్రమే మహిళలున్నారు. వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన మహిళ డ్రైవర్లతో పింక్ బస్ లు మొత్తం మహిళల తో కళకళలాడుతున్నాయి.