Categories
పూణే కు చెందిన రణ్ రాగిని బౌన్సర్ గ్రూప్ లో అందరూ అమ్మాయిలే ఉంటారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు దీపా పరాబ్. సినిమాల్లో మేకప్ ఆర్టిస్ట్ గా పోలీస్ పాత్రల్లో నటించింది సినిమా నటుల పక్కన బౌన్సర్లు ఉండటం గమనించిన దీపా కొన్నాళ్ళు బౌన్సర్ గా సెలబ్రిటీల దగ్గర పని చేసింది. ఈ రంగంలో అమ్మాయిలకు డిమాండ్ ఉందని తెలిశాక రణ్ రాగిని బౌన్సర్లు గ్రూప్ ని ఏర్పాటు చేసింది దీపా. ఎంతో మందికి శిక్షణ ఇస్తోంది. ఈవెంట్లు , వేడుకలు, ర్యాలీల్లో ప్రతి చోట ఈమె శిక్షణ ఇచ్చిన బౌన్సర్లు కనిపిస్తారు. ఇప్పటివరకు వెయ్యి మందికి శిక్షణ ఇచ్చింది దీప మహిళలు శారీరక మానసిక దృడత్వాన్న నింపి ఆత్మవిశ్వాసం తో జీవించటం నేర్పించాలని నా ఆశ. ఇప్పుడు ఎంతోమంది సెక్యూరిటీ గార్డ్ లుగా ఉపాధి పొందుతున్నారు అని చెబుతోంది దీపా పరాబ్.