మణిపూర్ ఉక్కు మహిళ మేరీకోమ్ మరో సారి పసిడి కాంతులతో మెరిసిపోయారు. ప్రపంచ ఛాంపియన్ చరిత్రలో ఆరో స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీ చరిత్రలో సక్సెస్ ఫుల్ బాక్సర్ గా రికార్డు సాధించింది. ప్రపంచ బాక్సింగ్ లో అత్యాధిక పతకాలు గెలచిన మహిళ క్రీడాకారిణి మేరీకోమ్ నే. 2010లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకోన్న మేరీ ,ఎనిమిదేళ్ళ సుదీర్ఘకాలం విరామం తరువాత మళ్ళీ ప్రపంచ బాక్సింగ్ లో స్వర్ణం గెలుచుకొంది. స్వర్ణం గెలుచుకోవటం ఇది 6వసారి.

Leave a comment