ఏ పనైనా 21 రోజుల పాటు చేస్తే అది అలవాటు అయిపోతుందని చెబుతుంటారు కానీ అందులో నిజం లేదంటారు యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా పరిశోధకులు టైప్- 2 డయాబెటిస్ గుండె జబ్బులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మంచి అలవాట్ల తో జీవన శైలిలో మార్పు చేసుకోవాలని డాక్టర్స్ చెపుతారు. ఈ నేపథ్యంలో కొత్త అలవాటు నేర్చుకునేందుకు ఎన్ని రోజులు పడుతుంది అన్న విషయం పైన పరిశోధన చేస్తే ఒక మంచి అలవాటు చేసుకునేందుకు కనీసం ఒక సంవత్సరం పడుతుందని తేలిందట. ఆ చేసుకోవాలనుకునే అలవాటు ఉదయం పూట మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు పరిశోధకులు.

Leave a comment