2018 లో మోదటి ఇండియన్ ఉమెన్ పైలేట్ గా మిగ్ 21 బైసన్ విమానాన్ని 30 నిముషాలు పాటు నడిపి చరిత్ర సృష్టించింది అవని చతుర్వేది. లెప్టెనెంట్ ర్యాంక్ ను కూడా అందుకుంది. భారత వాయి సేనలో చేరిన మోదటి ముగ్గురు మహిళ పైలెట్లలో అవని ఒకరు. ఆమెది మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లా. షారోల్ జిల్లాలోని డియోలాండ్ లో పాఠశాల చదువు పూర్తి చేసింది అవని. బనస్థలి యునవర్సిటిలో బిటెక్ పూర్తి చేసింది. ఆ తరువాత ఇండి యన్ ఎయిర్ ఫోర్స్ పరీక్ష రాసి అర్హత సంపాదించింది. ట్రైయినింగ్ అకాడామిలో పురుషులతో సమానంగా కఠోరమైన శిక్షణ తిసుకుంది అవని. ఫ్లై ఫైటర్ జేట్స్ సుఖోయ్ తేజస్ వంటి యుధ్ధ విమానాలు నడిపే అనుభవం సొంతం చేసుకుంది అవని.

Leave a comment